ఈ గణేష్ మండపాల ప్రత్యేకతలు తెలుసా..!

Spread the love

వినాయక చవితి వేడుకల వేళ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అన్ని రాష్ట్రాల్లో వీధి వీధినా వెలసిన వినాయక మండపాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది కూడా భక్తులు ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు తమ ప్రత్యేక రూపాలతో విశేషంగా  ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయకమైన సిద్ధి వినాయకుడు, లంబోధరుడు, పంచముఖ గణపతి రూపాలతో పాటు సోషల్ మెసేజ్, వర్తమాన అంశాలు మరియు పర్యావరణ పరిరక్షణను ప్రతిబింబించేలా తయారైన వివిధ వినూత్న రూపాల్లో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. 

ఈసారి మండపాల్లో వైవిధ్యమైన థీమ్‌లతో రూపొందించిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకువచ్చే నగరం ముంబై. మన దేశంలోనే ఘనంగా ముంబైలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ  పండుగ కోట్లాది మందికి  ఎమోషన్. ముంబై వీధుల్లో వేలాది గణేష్ మండపాలు కొలువుదీరుతాయి. అయితే, వీటన్నింటిలో కొన్ని మండపాలు మాత్రం వాటి రేంజ్, భక్తుల తాకిడి, వాళ్లకు వచ్చే కోట్ల రూపాయల విరాళాలతో దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా నిలుస్తాయి. కింగ్స్ సర్కిల్ లోని జి.ఎస్.బి సేవా మండల్ గణేషుడు. ముంబైలోనే కాదు, బహుశా భారతదేశంలోనే అత్యంత ధనిక గణపతిగా పేరుగాంచింది ఈ జి.ఎస్.బి సేవా మండల్. ఇక్కడ కొలువుదీరే స్వామివారిని గోల్డ్ గణపతి అని కూడా పిలుస్తారు. ఈ స్వామివారి విగ్రహాన్ని ఏకంగా 60 నుండి 70 కిలోల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.  ఈ సంవత్సరం మహా గణపతి విగ్రహాన్ని ఏకంగా 66 కిలోలకు పైగా స్వచ్ఛమైన బంగారు ఆభరణాలతో,  దాదాపు 335 కిలోల వెండి వస్తువులతో అత్యంత వైభవంగా అలంకరించారు.   ఈ ఆభరణాలు, వాటిపై పొదిగిన విలువైన జాతి రత్నాలు అన్నీ కూడా భక్తులు, సేవాదార్లు, దాతలు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలు. ప్రతి సంవత్సరం భక్తులు ఇచ్చే ఈ కానుకల వల్ల, స్వామివారికి అలంకరించే బంగారం బరువు పెరుగుతూనే వస్తోంది.  ఇక ఈ మండపం తీసుకునే ఇన్సూరెన్స్  కూడా వార్తల్లో నిలుస్తుంది. ఈ బంగారు ఆభరణాలకు, మండపానికి, పండల్ లో పని చేసే వాలంటీర్లకు, అక్కడికి వచ్చే భక్తుల భద్రత కోసం వీరు ఏకంగా ప్రతి సంవత్సరం 300 నుండి 400 కోట్ల రూపాయల మేర భారీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటారు ఇక  ఈ సంవత్సరానికి గాను GSB సేవా మండల్ నిర్వాహకులు ఏకంగా 703 కోట్లకు పైగా  బీమా కవరేజ్ తీసుకున్నారు. ఇక పూణె లోని దగ్దుసేత్ హల్వాయి  . భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ప్రముఖ వేదిక శ్రీమంత్ దగ్దుశేత్ హల్వాయి సార్వజనిక్ గణపతి ట్రస్ట్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మండపానికి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ట్రస్ట్‌ కు కూడా సాధారణ రోజుల్లోనూ, పండుగ సమయాల్లోనూ భారీ మొత్తంలో కానుకలు అందుతాయి. ఒక గణేష్ ఉత్సవాల సీజన్‌లోనే కోట్లాది రూపాయల నగదు రూపేణా విరాళాలు వస్తాయి. భక్తులు భక్తిభావంతో సమర్పించే ఈ కానుకలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఈ ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇక ముంబై గణేష్ ఉత్సవాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే లాల్‌బాగ్ చా రాజా . సంపద పరంగా GSB మండల్ ముందున్నా.. జనాదరణ, క్రేజ్ విషయంలో మాత్రం లాల్‌బాగ్ చా రాజాయే నంబర్ వన్. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిలబడతారు. కేవలం ఈ గణేషుని డెకరేషన్ థీమ్ ను సెట్ చేయడానికే భారీగా ఖర్చు అవుతుంది.  ప్రతి ఏడాది  ఈ గణేషునికి కానుకల రూపంలోనే  14 కేజీల బంగారం 250 కేజీల వెండి , కోటి రూపాయల క్యాష్ వస్తుంది.  ఈ మండపానికి కూడా సగటున 30 నుండి 40 కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. 

ముంబై మహానగరంలోని ప్రతిష్టాత్మక వేదికల్లో అంధేరి చా రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆజాద్ నగర్ సార్వజనిక్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుక ఈ సంవత్సరంతో అరుదైన మైలురాయిని తాకింది. సరిగ్గా 60 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటోంది 1966లో ప్రారంభమైన ఈ ఉత్సవానికి నవసాల పావనరా గణపతిగా పేరుంది. అంధేరి చా రాజా నిమజ్జన వేడుక మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. అనంత చతుర్దశి ముగిసిన ఐదు రోజుల తర్వాత వచ్చే సంకష్ట చతుర్దశి రోజున అత్యంత వైభవంగా నిమజ్జన యాత్ర చేస్తారు. ఇక మరో ప్రతిష్టాత్మక గణేష్ గల్లీ బుంబై చా రాజా కూడా ముంబైలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధ గణేష్ మండళ్లలో ఒకటి.   మొదటిసారిగా 1928లో ఈ ప్రాంత కార్మికుల కోసం ప్రారంభమైన ఈ మండలం, నేడు 99 వ ఏడాది వేడుకలను జరుపుకుంటోంది. రాబోయే శతాబ్ది ఉత్సవాల కోసం నిర్వాహకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *