ఏలూరు జిల్లాలో దారుణ ఘటన..మైన‌ర్ బాలిక పై చ‌ర్చి పాస్ట‌ర్ అత్యాచారం

Spread the love

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైన‌ర్ బాలిక పై చ‌ర్చి పాస్ట‌ర్ అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఆ బాలిక  గర్బం కూడా దాల్చడం సంచలనంగా మారింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువులో బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం చేశాడు. గ్రామంలో చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్న చౌటపల్లి రాంబాబు (42) గత కొంతకాలంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మోతాదుకు మించి చర్చి పాస్టర్ బాలికతో గర్బనిరోధక మాత్రలు మింగించడం తీవ్ర రక్తస్రావంతో బాలిక అనారోగ్యం పాలవడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తోంది. ఈ ఘటన పట్ల స్థానికులు మండిపడుతున్నారు. బాలికను వైద్యం నిమిత్తం తల్లిదండ్రులు ఏలూరు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో చర్చి పాస్టర్ రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో ఇటువంటి మృగాలు బాలికలపై అఘాయిత్యాలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల నుండి ఆగ్రహావేశాలు  వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *