‘OG’ యూనివర్స్ నుండి OST..పవన్ ఫ్యాన్స్ ఖుషీ 

Spread the love

పవన్ ‘OG’ యూనివర్స్ నుండి మరో సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేలా తాజాగా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేశారు. ఇది అన్ని మేజర్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉండనుంది. థమన్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ అనౌన్స్మెంట్ విడియోలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీనిని వైరల్ చేసేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘OG’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్, థమన్ ఏ స్థాయిలో తదుపరి ప్రాజెక్టును తీసుకువస్తారో అని అంచనాలు పెరిగిపోయాయి. 

ఓజస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ చూపించిన అభినయం, ఆయన బాడీ లాంగ్వేజ్ అభిమానులను థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. సుజిత్ దర్శకత్వ ప్రతిభ, థమన్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా థమన్ కంపోజ్ చేసిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆ సమయంలో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ వస్తున్న ఓజీ టూ ప్రాజెక్ట్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పర్యవేక్షణలో ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు సుజిత్ ఈసారి కథను మరింత పవర్ ఫుల్ గా  తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో చూపించని కొన్ని కీలకమైన కోణాలను, ముఖ్యంగా ప్రధాన పాత్ర ఒజస్ గంభీర జపాన్ నేపథ్యం ఈ రెండో భాగంలో లోతుగా ఆవిష్కరించబోతున్నారు. జపాన్ దేశానికి చెందిన కొన్ని అంశాలు, అక్కడి సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ఇలా డిఫెరెంట్ నేపథ్యంలో ఈ కథ సాగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డ్రామా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మాత్రమే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ కథను సిద్ధం చేశారు. మ్యూజిక్ పరంగా కూడా ఈసారి భారీ ప్రణాళికే సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అన్ని ప్రధాన సంగీత వేదికలపై అందుబాటులోకి రాగానే ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫ్యాన్స్ ఈ ట్యూన్లను విపరీతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే ఈ స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాలకే సాధ్యమని చర్చించుకుంటున్నారు. రాజకీయంగా బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్స్ విషయంలో పవన్ చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే, మరోవైపు ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సమయం కేటాయిస్తూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మొదటి భాగం సాధించిన ఘన విజయం కేవలం వాణిజ్య పరమైన రికార్డులకే పరిమితం కాకుండా, ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్‌కు బలమైన పునాది వేసిందని ప్రముఖ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు భిన్న నేపథ్యాల్లో తెరకెక్కుతున్న దానిని బట్టి చూసుకుంటే తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి మరోసారి తీసుకువెళ్తుందని ట్రేడ్ వర్గాలతో పాటు  కాకుండా అభిమానులు కూడా  ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *