బెంగాల్ లో మాజీ సీఎం మమత బిగ్ స్కెచ్!

Spread the love

బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక సంచలనం నమోదైంది. మమతా బెనర్జీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో నందిగ్రామ్ అనేది కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు.. అది బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఒక చారిత్రక ఉద్యమ కేంద్రం. వామపక్షాల కంచుకోటను బద్దలుకొట్టి మమతా బెనర్జీని అధికార పీఠం మీద కూర్చో పెట్టింది  నందిగ్రామే. అలాంటి ప్రతిష్టాత్మక స్థానంలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్  వెనక్కి తగ్గి, కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు భిన్న ధృవాలుగా ఉన్నప్పటికీ కేవలం నందిగ్రామ్‌లో మాత్రం ఆ రెండు పార్టీల క్యాడర్ కలిసి పనిచేయాలని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. టీఎంసీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి ,  కాంగ్రెస్ అభ్యర్థికి టీఎంసీ ఓటు బ్యాంకును బదిలీ చేసేలా మమతా బెనర్జీ భారీ వ్యూహరచన చేశారు. దశాబ్దాలుగా బెంగాల్‌లో ఒంటరి పోరు చేస్తూ, ఎవరి పొత్తూ అవసరం లేదని గర్వంగా చెప్పుకునే టీఎంసీ.. ఇప్పుడు కాంగ్రెస్ కు భుజం కాయడం చర్చనీయంశంగా మారింది. అయితే అప్పట్లో తనను ఓడించిన సువెందు అధికారిని ఓడించడం కోసం ఏ స్థాయికైనా వెళ్లేందుకు ఇప్పుడామె ఆమె సిద్ధమయ్యారు.

నందిగ్రామ్‌లో సుమారు 30 శాతానికి పైగా మైనారిటీ  ఓటర్లు ఉన్నారు. 2021 ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడినప్పటికీ, కాంగ్రెస్-వామపక్షాల కూటమి కూడా గణనీయంగా ఓట్లను చీల్చింది. మరోవైపు సువెందు అధికారి మెజారిటీ హిందూ ఓట్లను ఓన్  చేసుకోగలిగారు.యాంటీ-బీజేపీ ఓట్లు.. టీఎంసీ, కాంగ్రెస్ మధ్య చీలిపోవడం వల్లే తాను ఓడిపోయానని మమతా బెనర్జీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈసారి ఆ తప్పు జరగకుండా, బీజేపీ వ్యతిరేక ఓటు  అంతా ఒకే అభ్యర్థికి పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ద్వారా మైనారిటీ ఓట్లతో పాటు, కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు కూడా సువెందుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తాయని టీఎంసీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. కేవలం సువెందును ఓడించడం కోసమే మమత తన అహంకారాన్ని పక్కనపెట్టి ఈ పొలిటికల్ అడ్జస్ట్‌మెంట్‌కు సిద్ధమయ్యారు.

నందిగ్రామ్‌లో ఈ కొత్త కూటమిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. సువెందు అధికారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే మమతా బెనర్జీ కాంగ్రెస్ వెనుక దాక్కుంటున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. టీఎంసీకి సొంత అభ్యర్థిని నిలబెట్టే ధైర్యం లేదని, ఇది మమతా బెనర్జీ నైతిక ఓటమి అని బీజేపీ చురకలంటిస్తోంది. అయితే, ఈ పరిణామం రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. కేవలం నందిగ్రామ్‌కే పరిమితమైన ఈ టీఎంసీ-కాంగ్రెస్ దోస్తీ.. విజయవంతమైతే  అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఫార్ములాను అమలు చేసే యోచనలో ఇండియా కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మమత వ్యూహం ఫలిస్తుందా లేక మరోసారి  సువెందుదే పైచేయి అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *