తెలుగు సినిమా సోసియో ఫాంటసీ రేంజ్ ను పెంచిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సినిమాలు ఉంటాయి. మళ్లీ ఆ స్థాయిలో కల్ట్ క్లాసిక్స్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తిస్థాయి సోషియో-ఫాంటసీ విజువల్ వండర్ విశ్వంభర కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చింది. చాలా కాలంగా విశ్వంభర సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారిన ఓటీటీ హక్కుల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అత్యంత భారీ ధరకు ఈ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ డీల్ క్లియర్ అవ్వడంతో ఇక థియేట్రికల్ రిలీజ్ డేట్‌పై మేకర్స్ కసరత్తు మొదలుపెట్టారు. టాలీవుడ్లో ఇప్పుడు పెద్ద సినిమాలకు నాన్-థియేట్రికల్ రైట్స్ ముఖ్యంగా ఓటీటీ డీల్స్ కుదుర్చుకోవడం పెద్ద సవాలుగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లైన్లోకి వచ్చి, భారీ ధరకు విశ్వంభర డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసుకున్నట్లు కన్ఫర్మ్ అయింది. రిలీజ్ కు ఉన్న ఈ అతిపెద్ద బ్రేక్ క్లియర్ అవ్వడంతో యూవీ క్రియేషన్స్ మేకర్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల స్పీడ్ పెంచారు.
ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయ్యింది. మరి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుంది. విశ్వంభర సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పనులు ఉండటం వల్ల, ముందుగా అనుకున్న తేదీలకు సినిమాను తీసుకురాలేకపోయారు. దాంతో ఇప్పుడు నేరుగా ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక కొత్త చిక్కు వచ్చిపడింది. ఇటీవలే చిరు మరో సినిమా ‘కాకా’ కూడా సంక్రాంతికే వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు విశ్వంభర కూడా జనవరి 9న సంక్రాంతి రేసులోకి వస్తే.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఒకే స్టార్ హీరో నటించిన రెండు భారీ సినిమాలు విడుదల కావడం అసాధ్యం. సంక్రాంతికి వేరే హీరోల సినిమాలు కూడా ఉంటాయి కాబట్టి థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి, ఈ రెండు సినిమాల్లో ఒకదాన్ని సంక్రాంతికి ఉంచి, మరొకదాన్ని సమ్మర్‌కు వాయిదా వేసేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
ఇక విశ్వంభర సినిమా విషయానికొస్తే.. కేవలం చిరు ఫ్యాన్స్‌కే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎనలేని ఆసక్తి ఉంది. బింబిసార లాంటి బ్లాక్‌బస్టర్ సోషియో-ఫాంటసీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ, తెరకెక్కిస్తుండడంతో అంచనాలు పెరిగాయి. యూవీ క్రియేషన్స్ అత్యద్భుతమైన నిర్మాణ విలువలతో నిర్మించింది. ఇక చాలా సంవత్సరాల తరువాత మెగాస్టార్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ అతి త్వరలోనే అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఒక స్పెషల్ పోస్టర్‌తో అనౌన్స్ చేసే అవకాశముంది. బాబీ కాకా సంక్రాంతికి వస్తుందా? లేదా సోషియో ఫాంటసీ విశ్వంభర బరిలో దిగుతుందా? అనేది బాస్ డిసిషన్‌పై ఆధారపడి ఉంది. ఏది ఏమైనా మెగా అభిమానులకు మాత్రం ఈ న్యూస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.