నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్లామరస్, బబ్లీ పాత్రలతో మెప్పిస్తూనే తన ఇమేజ్ ను పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ యాక్షన్ రోల్‌తో మన ముందుకు రాబోతోంది. అదే పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మైసా . తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటన లోనిమరో కోణాన్ని పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో రష్మిక ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సరికొత్త అవతారంలో కనిపించింది. తాజాగా మూవీ టీమ్ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. టీజర్ ప్రారంభంలోనే రష్మిక వాయిస్ ఓవర్‌తో ఒక సీరియస్ టోన్ సెట్ చేశారని మనకు అర్థమవుతోంది. అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను.. అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ సినిమా డెప్త్ ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ తో భారీగా ఉంది. అండర్‌వాటర్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త, థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తున్నాయి. గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, రష్మిక చేస్తున్న ఇటువంటి పాత్రలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ టీజర్లో విజువల్స్ తో పాటు డైలాగ్స్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా పేలాయి. ముఖ్యంగా వెర్సటైల్ నటుడు రావు రమేష్ వాయిస్ తో చెప్పిన ఒక డైలాగ్ సినిమా కథ తీవ్రతను మరింతగా పెంచింది. యుద్ధానికి ఆయుధం అంటే భయం కావచ్చు.. కానీ ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు అనే ఆ పవర్ ఫుల్ డైలాగ్, రష్మిక చేస్తున్న స్టంట్స్ కు అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చింది. పవర్ ఫుల్ లుక్స్ తో పోరాడే ఒక యోధురాలిగా రష్మిక క్యారెక్టర్ ను దర్శకుడు ఇందులో అద్భుతంగా తీర్చిదిద్దారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఒక బలమైన ఎమోషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చావు నుండైనా నీకోసం వస్తాను నాన్న.. అంటూ రష్మిక కన్నీళ్లతో, కసితో చెప్పే డైలాగ్ ఆ డెప్త్ తెలుపుతోంది. ఈ ఒక్క సీన్‌తో తండ్రి-కూతుళ్ల అనుబంధం ఈ సినిమాకి ఎంత కీలకమో, ఆ ఎమోషనే ఈ సినిమాకు ప్రాణం అని మనకు అర్థమవుతోంది. అసలు ఆ అడవి నేపథ్యంలో ఆ తండ్రికి ఏం జరిగింది? ఆమె ఎవరిపై ఈ యుద్ధం చేస్తోంది? ఇవన్నీ సినిమాపైఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ విజువల్స్ క్వాలిటీ చాలా బాగుంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు ప్రాణం పోసింది. ఆ యాక్షన్ , ఎమోషనల్ సన్నివేశాలను నేపథ్య సంగీతం శిఖరాగ్రానికి తీసుకెళ్ళింది. కథను పూర్తిగా రివీల్ చేయకుండానే, కేవలం విజువల్స్ , ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్ తో మేకర్స్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. రష్మిక డెడికేషన్ ప్రతి ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రవీంద్ర పుల్లే తెరకెక్కించిన ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మైసా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అన్ ఫార్ములా ఫిలిమ్స్ పతాకంపై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యాపురెడ్డి, వీరాసాయి గోపా నిర్మించారు.