ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పలు శాఖల్లో 892 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఉంది.గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 6 నుండి 27 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఇక మిగిలినవి 729 పోస్టులు వీటికి సంబంధించి కూడా వివరాలను అధికారిక వెబ్ సైట్ లో వివరాలు ఉంచింది. వీటి కోసం అక్టోబర్ 16 నుండి నవంబర్ 5 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఈ నోటిఫికేషన్ పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా సరైన అవకాశాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఈ నిర్ణయంతో తమ ప్రతిభను నిరూపించుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిరుద్యోగ అనుకూల నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పోటీ పరీక్షలకు అహర్నిశలు శ్రమిస్తున్న విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ఒక కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి. కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలలో రాత్రింబవళ్లు పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూ సన్నద్ధమవుతున్న యువత తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇదొక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువతలో ఈ నిర్ణయం నింపిన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఒకవైపు పాలన వేగవంతం కావడమే కాకుండా, మరొకవైపు అర్హులైన యువతకు ఉపాధి లభించి వారి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కష్టపడి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేస్తున్నారు.
ఇక ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, తుది ఎంపిక వరకు ప్రక్రియను అంతే వేగంగా పూర్తి చేయాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు. సమర్థవంతమైన ప్రణాళికతో నియామక ప్రక్రియ సాగితే ఎంతోమంది అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల యువతకు మేలు జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.