కమలా రెడ్డిగా రమ్యకృష్ణ….మరోసారి శివగామి రేంజ్ పవర్ ఫుల్ పాత్ర

Spread the love

డేవిడ్ రెడ్డి అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో తన పవర్ ఫుల్ అప్పీరెన్స్ తో దుమ్ముదులిపేందుకు సిద్దమవుతున్నాడు మంచు మనోజ్.  ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను ఆకాశానికెత్తేలా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో భారతీయ సినిమా చరిత్రలోనే పవర్ ఫుల్ పాత్రల్లో ఒకటిగా నిలిచేలా నటించి అలరించిన నటి రమ్యకృష్ణ  ఈ సినిమాలో ఒక అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు సెప్టెంబర్ 15, రమ్యకృష్ణ  పుట్టినరోజు సందర్భంగా.. డేవిడ్ రెడ్డి సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. డేవిడ్ రెడ్డి సినిమాలో రమ్యకృష్ణ  కమలారెడ్” అనే ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ఈ పోస్టర్‌కు ఇచ్చిన క్యాప్షన్ చూస్తేనే పాత్ర డెప్త్ అర్థమవుతుంది. యుద్ధరంగమే ఆమెను చూసి భయపడుతుంది అనే క్యాప్షన్‌తో ఈ లుక్‌ను వదిలారు. పోస్టర్ లో రమ్యకృష్ణ  లుక్ ఎంత ఫెరోషియస్‌గా ఉందంటే.. ఆమె పాదాల కింద శవాలు పడి ఉన్నాయి, చుట్టూ రక్తం చిమ్మిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చేతిలో ఒక పదునైన ఆయుధం పట్టుకుని, కళ్లలో కోపం, పౌరుషం ఉట్టిపడేలా ఆమె ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే.. కమలారెడ్డి పాత్ర ఈ సినిమాకు ఎంత కీలకం అనేది అర్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఇది 1897 నుండి 1920ల మధ్య కాలంలో జరిగిన కథ. అంటే అప్పటి బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం, బ్రిటిష్ వారి దారుణాలు, వాళ్ల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథే ఈ డేవిడ్ రెడ్డి అని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసి, ఆర్ట్ వర్క్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. నాటి కాలాన్ని కళ్లకు కట్టేలా చూపించేందుకు నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి  దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో కేవలం మంచు మనోజ్, రమ్యకృష్ణ మాత్రమే కాదు.. కాస్టింగ్ పరంగా చాలా పెద్ద పేర్లే ఉన్నాయి. ఉక్రెయిన్ భామ మరియా రియాబోషాప్కా  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు సముద్రఖని,   బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అభయ్ డియోల్  ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *