మొదటి రోజు భారీ కలెక్షన్లతో దుమ్ముదులిపిన ‘ది ప్యారడైజ్’

Spread the love

‘ది ప్యారడైజ్’ సినిమా కలెక్షన్ల పరంగా మొదటి రోజు  అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ ను విడుదల చేసింది. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మొదటి రోజు రికార్డు కలెక్షన్లతో అదరగొట్టింది. రూ. 88 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, సోనాల్ కులకర్ణి, రాఘవ్ జుయెల్, ప్రియదర్శి  తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. పాటలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో తెలిసిందే. నాని మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారు. ఆయన నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది.  ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నానికి ఉన్న స్టామినా ఏంటో చూపించింది. ప్రీమియర్స్ తోనే  బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి, నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ హైయెస్ట్ డే-1 కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. నాని మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. క్లిష్టమైన ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ లో ఆయన చూపించిన నటన, హావభావాలు ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసాయి. ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో సీన్లను పతాకస్థాయికి తీసుకెళ్లిన తీరుకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఒక వైవిధ్యమైన పాత్రలో జీవించిన నాని, తన మేనరిజమ్స్ మరియు డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఈలలు, కేకలు వేయించారు. ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వీరి కాంబినేషన్ వలన కూడా ఈ ప్రాజెక్టుకు ఇంత క్రేజ్ ఏర్పడింది. నానిని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించారు. కథనాన్ని నడిపించిన తీరు, మాస్ అండ్ ఎమోషనల్ సీన్లను బ్యాలెన్స్ చేసిన విధానం అభిమానులను మెప్పిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం మేజర్ హైలైట్‌గా నిలిచింది. విడుదలకు ముందే పాటలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. థియేటర్లలో పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలూగడమే కాకుండా, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. తన రీ-రికార్డింగ్‌తో అనిరుధ్ మరోసారి సినిమా స్థాయిని పెంచేశారు. నాని సరసన హీరోయిన్‌గా నటించిన కయాదు లోహర్ తన అందం, అభినయంతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో భారీ తారగణం నటించడం కథకు మరింత బలాన్నిచ్చింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో మెరవగా, ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, సోనాల్ కులకర్ణి, రాఘవ్ జుయెల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించిన ‘ది ప్యారడైజ్’, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాలను సైతం దాటి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *