తన క్లాసికల్ డ్యాన్స్ తో అలరించిన డింపుల్ హయతి

Spread the love

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల నటి  డింపుల్ హయాతి. వెండితెరపై ఎంతో గ్లామరస్‌గా, చలాకీగా కనిపించే ఈ ముద్దుగుమ్మలో మరో యాంగిల్ కూడా ఉంది. తాజాగా కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన  సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో డిపుల్ హయతి చేసిన కూచిపూడి నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీవారి సన్నిధిలో డింపుల్ హయాతి ఇచ్చిన ఆ క్లాసికల్ నృత్య ప్రదర్శనతో ప్రతి ఒక్కరినీ ఫిదా చేసింది.  తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికలపై దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రఖ్యాత కళాకారులు తమ ప్రదర్శనలతో స్వామివారికి కళాంజలి ఘటించారు.  అందులో భాగంగానే సినీనటి  డింపుల్ హయాతి తన అద్భుతమైన కూచిపూడి నృత్యంతో భక్తులందిరినీ ఆకట్టుకుంది.  ఆమె నృత్య ప్రతిభతో అలరించారు. ఈ ప్రదర్శనకు ముందు రోజునే డింపుల్ హయాతి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి సన్నిధిలో ఈ నాట్య ప్రదర్శన చేశారు. అయితే డింపుల్ నాట్యానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె నాట్యానికి  అభిమానులు ఫిదా అవుతున్నారు. 

సాధారణంగా హీరోయిన్లు అనగానే కమర్షియల్ పాటల్లో స్టెప్పులు వేయడం, గ్లామర్ రోల్స్ చేయడం వరకే చాలామంది ఊహిస్తారు. అయితే చిన్నతనం నుండే భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూ శాస్త్రీయ కళలను నేర్చుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. డింపుల్ హయాతిలో అలాంటి ఒక అంకితభావం ఉన్న క్లాసికల్ డ్యాన్సర్ ఉండటం నిజంగా అభినందించదగ్గ విషయమని ప్రశంసలు వస్తున్నాయి.  ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో క్లిప్స్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇన్నాళ్లూ డింపుల్ హయాతిని ఒక  గ్లామరస్ హీరోయిన్‌గానే చూసిన వారు ఆమెలో ఇంత గొప్ప సంప్రదాయ కళా నైపుణ్యం ఉందా?  అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె సినిమా నేపథ్యాన్ని చూసుకుంటే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఆమె పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. గద్దలకొండ గణేష్. ఆ చిత్రంలో వచ్చిన జర్రా జర్రా అనే స్పెషల్ సాంగ్‌తో డింపుల్ హయాతి టాలీవుడ్ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి, గోపీచంద్ నటించిన రామబాణం సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది. తమిళంలో విశాల్ సరసన వీరమే వాగై సూడుమ్ లో రవితేజతో  భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి విభిన్న చిత్రాల్లోనూ కనిపించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం లో డింపుల్ ఒక కీలక పాత్రలో నటించింది. వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా అంటే కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఈ సినిమా వచ్చే నెల, అంటే అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *