తమిళ సినీ వర్గాల్లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం, స్టార్ హీరో సూర్య కలయికలో మరొక భారీ చిత్రం రాబోతుందనే వార్తలు నెట్టింట తీవ్రంగా హల్ చల్ చేస్తున్నాయి. మణిరత్నం సినిమా అనగానే ఒక అద్భుతమైన విజువల్స్, మనసును హత్తుకునే ఎమోషన్స్, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ గుర్తుకు వస్తాయి. ఆయన డైరెక్షన్ లో నటించడానికి పాన్ ఇండియా హీరోలు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన యువ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో సూర్య చేసిన మైఖేల్ క్యారెక్టర్ లో అదరగొట్టారు. ఇప్పుడు ఈ మాసివ్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది అన్న వార్త ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగిస్తోంది. ఇద్దరూ పీక్ స్టేజ్ లో ఉన్న ఈ సమయంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే అది బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుందో మనం ఊహించుకోవచ్చు.
సూర్యా అండ్ మణిరత్నం కాంబో గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ కాంబో ఈరోజు, నిన్న అనుకున్నది కాదు. దాదాపు 8 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉందని తెలుస్తోంది. అప్పట్లో మణిరత్నం సూర్యకు ఒక అద్భుతమైన లైన్ వినిపించారని, ఇద్దరికీ ఆ కథ ఎంతో నచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.డేట్స్ సమస్యలు, బడ్జెట్ కి సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. పూర్తిగా ఆగిపోయింది అనుకున్న ఆ కథను మణిరత్నం ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం పాత కథను ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా.. నేటి ట్రెండ్‌కు, ఇప్పటి పాన్ ఇండియా ఆడియన్స్ టేస్ట్ కు తగినట్లుగా ఆ కథలో కొన్ని ముఖ్యమైన మార్పులు-చేర్పులు చేశారని తెలుస్తోంది.
మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఇంజి వెల్లమ్ అనే భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా పూర్తయిన వెంటనే, ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ గా సూర్యతో కలిసి పనిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సూర్య లైనప్ మొత్తం ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ తో ఆవేశం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ ఏడాది నవంబర్ 6న చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కేవలం ఆ సినిమాతోనే ఆగకుండా, సూర్య చేతిలో మరో మూడు బడా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటి తరువాత మణిరత్నంతో సినిమా సెట్ అయితే గనక పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఒక అద్భుతమైన డైరెక్టర్, ఒక అద్భుతమైన యాక్టర్.. ఈ ఇద్దరి కలయిక కోసం కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన వస్తే ప్రేక్షకులకు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే అధికారిక ప్రకటన ఏమి రాలేదు.