సీ.ఎస్.కేలో  ముగిసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ శకం: కొత్త ప్రధాన కోచ్‌గా జహీర్ ఖాన్

Spread the love

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారత క్రీడా ప్రేమికులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల అభిమాన క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో విజయవంతమైన జట్టు 5 సార్లు ఈ ట్రోఫీని కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా భారీ అభిమానులున్న టీమ్ గా కొనసాగుతోన్న ఈ ఫ్రాంఛైజీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ను ప్రధాన కోచ్ గా నియమించుకుంది. 16 ఏళ్ల పాటు కోచ్ గా సేవలందించిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ ను నియమించింది. ఇక జహీర్ ఖాన్ కు ఒక టీమ్ కు ప్రధాన కోచ్ గా పనిచేయడం ఇదే మొదటిసారి. 2018-22వరకు ముంబై ఇండియన్స్ కు జహీర్ వివిధ హోదాల్లో పనిచేశాడు. 200 వన్డేలు,92 టెస్ట్ మ్యాచ్ లు, 17టీ 20లు, 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన అనుభవం జహీర్ ఖాన్ కు ఉంది. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో జహీర్ ఖాన్ పాత్ర కూడా కీలకమన్న సంగతి తెలిసిందే. ఇక సీ.ఎస్.కే హెడ్ కోచ్ గా జట్టును ఏవిధంగా ముందుకు తీసుకెళ్తాడో అనే ఆసక్తి ఆ జట్టు అభిమానుల్లో ఉంది. 

క్రికెట్ ప్రపంచంలోనే ఒకే ఫ్రాంఛైజీతో ఇంతకాలం కొనసాగిన కోచ్‌గా ఫ్లెమింగ్  ప్రత్యేక రికార్డు సృష్టించారు. ఇక జహీర్ నియామకం ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఈ నియామకం జరిగినట్లు ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడైన జహీర్ ఖాన్ అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఒక ఐపీఎల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయన పూర్తి బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతానికి ఆయనకు ఒక సంవత్సర కాలం పాటు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం. గతంలో జహీర్ ఖాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో వివిధ ఫ్రాంఛైజీలకు సేవలందించారు. ముంబై ఇండియన్స్ జట్టులో క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, గ్లోబల్ హెడ్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. అంతేకాకుండా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా మెంటర్‌గా సేవలందించారు. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. దీంతో ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ జట్టులో ప్రక్షాళన జరగాలని భావించింది. జట్టులో నూతనోత్సాహం నింపడానికి, యువ ఆటగాళ్లను సరైన మార్గంలో నడిపించడానికి కొత్త నాయకత్వం అవసరమని భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు కొత్త కోచ్ రాకను ఎలా స్వీకరిస్తారనేది వేచి చూడాలి. ధోనీ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వస్తున్న  తరుణంలో, జహీర్ ఖాన్ రాక జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. బౌలింగ్ విభాగంలో లోపాలను సరిదిద్దడంలో జహీర్ ఖాన్ ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండటం సీఎస్కే కు అదనపు బలం ఉండనుందని  అంచనా వేస్తున్నారు. 2027  ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎస్కే జట్టు ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సీఎస్కే అభిమానుల అంచనాలకు తగినట్లుగా జట్టును మళ్లీ విజయాల పథంలో నడిపించడంలో ఆయన పాత్ర కీలకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *