సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ‘జైలర్ 2’ విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఇక తరువాత ఆయన నటిస్తున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ నుండి నటి రాశీ ఖన్నా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలలో రజనీకాంత్ తో పాటు మన తెలుగు నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లో ఆయన నటిస్తున్నారన్న వార్తలకు క్లారిటీ వచ్చినట్లయింది. అయితే అధికారిక ప్రకటన రావాల్సిఉంది. దిగ్గజ నటుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండడం ప్రత్యేకత. ఇక ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధర్మన్’ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటి సిమ్రాన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మైసూర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.త్వరలోనే అధికారిక విడుదల తేదీ వెలువడే అవకాశం ఉంది. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఎలాంటి క్యారెక్టర్ ను రామ్ ఇందులో పోషించనున్నారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇటు తెలుగులో కూడా ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. ఇక రజనీ నటించిన జైలర్ 2 సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ కు సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అనిరుధ్ సంగీతం అందించారు. రమ్య కృష్ణన్, వినాయకన్, శివ రాజ్ కుమార్, మిర్నా మీనన్,యోగి బాబు, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తిలు కీలక పాత్రల్లో నటించనుండగా..హృతిక్ రోషన్, మోహన్ లాల్ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.