తిరుమల శ్రీవారి భక్తుల దశాబ్దాల నిరీక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో టీటీడీ ముగింపు పలికింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు తరలివచ్చినా, అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) మరియు టైమ్ స్లాట్ విధానం కారణంగా కేవలం 1.5 నుంచి 4 గంటల్లోనే దర్శనం పూర్తవ్వడం ఒక రికార్డుగా నిలిచింది.ఈ వ్యవస్థలో అమర్చిన 300 సీసీటీవీలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఆలయ ప్రాంగణాన్ని 3డీ నమూనాలో పర్యవేక్షిస్తూ, రద్దీ పెరిగినప్పుడు అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తాయి.భక్తుల సమూహాలను బట్టి స్క్రీన్‌పై రంగులు (ఎరుపు, పసుపు, పచ్చ) మారుతూ క్యూలైన్ల క్రమబద్ధీకరణకు సహకరిస్తాయి.ఈ విధానం విజయవంతం కావడంతో జనవరి 2 నుండి సర్వదర్శనం భక్తులకు, భవిష్యత్తులో లడ్డూ కౌంటర్లకు కూడా ఈ టెక్నాలజీని విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది.మరోవైపు వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరగగా, జనవరి 2026లో జరగనున్న రథసప్తమి వంటి విశేష పర్వదినాల జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు.