2025 వాతావరణ నివేదికను భారత వాతావరణ విభాగం విడుదల చేసింది. దేశంలో వార్షిక సగటు సాధారణం కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1901 నుండి రికార్డు చేయబడిన ఉష్ణోగ్రతల ప్రకారం, 2025వ సంవత్సరం భారతదేశంలో 8వ అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.28°C ఎక్కువగా నమోదైంది. 2025 ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వేడి నమోదైంది. ఇది 1901 తర్వాత అత్యంత వేడి ఫిబ్రవరిగా నిలిచింది. 1901 తర్వాత గతేడాది దేశంలో వార్షిక సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే 110 శాతం ఎక్కువగా నమోదైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తుల కారణంగా 2,760 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 410 మంది మరణించారు. 2026 జనవరిలో ఉత్తర మరియు మధ్య భారతంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని IMD అంచనా వేసింది.