ఏఐ ‘గ్రోక్’పై ‘ఎక్స్’కు 72 గంటల కేంద్రం అల్టిమేటం!

Spread the love

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ కు చెందిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) సృష్టిస్తున్న అశ్లీల, అసభ్యకర కంటెంట్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించింది. గ్రోక్ ఏఐని ఉపయోగించి మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేయడం, వికృతమైన వీడియోలు ఉండటం, బాలలపై దౌర్జన్యానికి సంబంధించిన కంటెంట్‌ను రూపొందించడం ఐటీ చట్టం-2000 మరియు 2021 నిబంధనల ప్రకారం తీవ్ర నేరమని కేంద్రం స్పష్టం చేసింది.ఈ ఉల్లంఘనలపై 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ‘ఎక్స్’ భారత ప్రతినిధికి నోటీసులు జారీ చేసింది.ముఖ్యంగా మహిళల గౌరవానికి, భద్రతకు భంగం కలిగించేలా ఉన్న ఏఐ ప్రాంప్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ భద్రతపై ప్రభుత్వ నిబద్ధతను చాటుతోంది.