H-1B ఉద్యోగులకు అమెజాన్ ఊరట…భారత్ నుంచే పని చేసేందుకు అనుమతి!

Spread the love

అమెరికా వీసా ఇంటర్వ్యూల జాప్యం కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయిన తమ H-1B ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం అమెజాన్ భారీ ఊరటనిచ్చింది.వీసా ప్రక్రియలో ఎదురవుతున్న తీవ్ర జాప్యం వలన మానసిక ఒత్తిడికి లోనవుతున్న సిబ్బందికి భరోసానిస్తూ, మార్చి 2 వరకు ఇంటి నుండే పని చేసేందుకు (Work From Home) అనుమతించింది.గత డిసెంబర్ 13 నుండి ఇంటర్వ్యూల కోసం వేచి చూస్తున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. 

అయితే, అమెరికా వీసా నిబంధనలు మరియు చట్టపరమైన పరిమితుల దృష్ట్యా, ఈ కాలంలో ఉద్యోగులు కొత్త కోడింగ్ రాయడం లేదా క్లయింట్లతో నేరుగా సంభాషించడం వంటి పనులు చేయకూడదని సంస్థ స్పష్టమైన ఆంక్షలు విధించింది. వీసా ఆలస్యం కారణంగా ఆర్థిక అనిశ్చితి, కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న టెక్ నిపుణులకు అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించడమే కాకుండా, ఇతర ఐటీ కంపెనీలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.