తెలుగు కేవలం భాష కాదు..మన జీవన విధానం.. మన సంస్కృతి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

Spread the love

గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న ‘3వ ప్రపంచ తెలుగు మహాసభలు’ ఘనంగా జరుగుతున్నాయి. కాగా, ఈ సభల  ప్రారంభోత్సవంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు అంటే కేవలం భాష కాదని అది మన జీవన విధానం, మన సంస్కృతి అని అన్నారు. ​అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని .. ​పల్లెల్లో సంక్రాంతి, దసరా, ఉగాది పండుగల వాతావరణం కనుమరుగవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. ​తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన,మహనీయుడు ఎన్టీఆర్ ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ మహాసభల్లో మేధావులు చేసే తీర్మానాలను తనకు పంపాలని, ఆ తీర్మానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, చర్చించి, ప్రభుత్వం ద్వారా అమలు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సత్యసాయి బాబా సన్నిధిలో, ఎన్టీఆర్ కళావేదికపై మాట్లాడటం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.