గుణశేఖర్ దర్శకత్వంలో సారా అర్జున్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యుఫోరియా’. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈరోజు ట్రైలర్ ను విడుదల చేశారు. ఈతరం యువత కేంద్రంగా అల్లుకున్న కథతో ఈ మూవీ రూపొందినట్లు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. నటీనటుల నటన నేపథ్య సంగీతం గుణశేఖర్ దర్శకత్వం ట్రైలర్ రూపొందించిన తీరు మూవీపై ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలంటే ఫిబ్రవరి 6 వరకు వేచిచూడాలి. నీలిమ గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.