భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి భారత్ కు పలు దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఈయూ, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ మొదలైన దేశాలు తమ శుభాకాంక్షలు తెలిపాయి. భారత్ తో మైత్రిని మరింత బలోపేతం చేసుకొంటామని ఈసందర్భంగా అయా దేశాధినేతలు, ప్రతినిధులు పేర్కొన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్:
‘భారత్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, చైనా, భారత్ ఎప్పటికీ మంచి పొరుగువారిగా, స్నేహితులుగా ఉంటాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను, సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాం’.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో:
‘భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశం యూఎస్‌ల మద్య చరిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. రక్షణ. ఇందనం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్ అమెరికాల మధ్య సహకారం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్:
భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూఢిల్లీ అంతర్జాతీయ అజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత్ తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా మల్టిపుల్ సెక్టార్లలో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్:
భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, గతంలో భారత గణతంత్ర వేడుకల్లో, పాల్గొనడం ఎంతో విలువైన జ్ఞాపకం. భారత్, ఫ్రాన్స్ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరిలో కలుద్దాం.
యూరోపియన్ నేతలు:
భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉంది. భారత్- ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. ఐరోపా యూనియన్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం.