అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

Spread the love

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భవిష్యత్ లక్ష్యాలకు అద్దంపట్టిందన్నారు.  నేలపాడు ప్రాంతంలోనిలో పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలోని పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నగరం సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గణతంత్ర దినోత్సవ వేదిక నుంచిరాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా… రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ఉంటుందని మాటిస్తున్నట్లు పవన్ పునరుద్ఘాటించారు.