ఇప్పుడు ఎక్కడ చుసిన మెగా ఫామిలీ గురించే చర్చ… మొన్నే కదా మన శంకర వర ప్రసాద్ తో పెద్ద హిట్ కొట్టాడు మన మెగాస్టార్… అలానే నిన్నే ఆ సినిమా లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్… ఈసారి ఏకంగా కేవలం 25 రోజుల్లో 375 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది… ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఇంకా పెద్ద సినిమాలు పోటీ కి రాలేదు కాబట్టి, ఇంకా కొన్ని రోజులు థియేటర్స్ లో ఉండేలా ఉంది! అదే జరిగితే 400 కోట్ల కలెక్షన్ గ్యారెంటీ. ఒక వైపు సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమా లన్ని OTT లో వస్తుంటే, మన శంకర వర ప్రసాద్ మాత్రం థియేటర్ లో దుమ్ము రేపుతోంది… అలాగే జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. ఆ ఇద్దరిలో ఒకరు మగబిడ్డ కాగా, మరొకరు ఆడబిడ్డ కావడం ఈ సంతోషాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఎన్నాళ్లుగానో మెగా వారసుడి కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త నిజమైన పండుగలా మారింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిసింది, అభిమానులు సంబరాలు జరుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా హిట్ అవ్వడం తో పాటు, రామ్ చరణ్, ఉపాసన కి కవలలు పుట్టడం కూడా పెద్ద శుభ వార్త… నిన్నే పిల్లిద్దరి తో ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు… ఆ వీడియో ఇంకా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది! ఇక ఇప్పుడు నెక్స్ట్ కథ ఏంటంటే… వారిద్దరికీ ఎం పేర్లు పెడతారు అనే…ఇటీవల వరుణ్ తేజ్ ఇంట మగబిడ్డ జన్మించగా ఆ చిన్నారికి ఆంజనేయుడి అంశ గా భావించి ‘వాయు తేజ్’ అని పేరు పెట్టారు. రామ్ చరణ్ ఇప్పటికే తండ్రిగా కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్న సమయంలో ఇప్పుడు ముగ్గురు పిల్లల తండ్రిగా మారడం మరో ప్రత్యేక ఘట్టంగా మారింది. అయితే ఈ సంతోషకర వార్తతో పాటు మరో ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది… అదే కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెడతారు అన్నదే అది. సాధారణంగా మెగా కుటుంబంలో పుట్టిన పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేర్లతో ఉండేలా నామకరణం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. కానీ మొదటి సారి రామ్ చరణ్ తన కూతురికి సంప్రదాయానికి భిన్నంగా ‘క్లిన్ కారా’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టారు. ఆ పేరు లలిత సహస్రనామంలోని ఆధ్యాత్మిక అర్థాన్ని ప్రతిబింబిస్తుందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇప్పుడు కవల పిల్లల విషయంలో కూడా అదే తరహా ఆధ్యాత్మికతతో కూడిన ప్రత్యేక పేర్లను ఎంచుకుంటారా? లేక సంప్రదాయాన్ని అనుసరిస్తూ దేవుని పేర్లతో నామకరణం చేస్తారా? ముఖ్యంగా మెగా వారసుడికి ఎవరు పేరు పెడతారు అన్న అంశంపై నెటిజన్ల మధ్య చర్చలు వేడెక్కుతున్నాయి. అభిమానులు కూడా ఈసారి చిరు ఇద్దరు పిల్లలని ఎత్తుకుని క్లిన్ కార పేరు రివీల్ చేసినట్టే, వీరిద్దరి పేర్లు చెప్పాలని కోరిక!