మెగా కోడలి స్పెషల్ వీడియో – ఆనందం లో కూడా భాద్యత మర్చిపోని ఉపాసన…

Spread the love

ఇటీవలే రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజంతా మెగా ఫాన్స్ అపోలో హాస్పిటల్ దెగ్గరే ఉన్నారు. ఎప్పుడైతే, మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్స్ తో సహా బయటికి వచ్చి, గుడ్ న్యూస్ మీడియా కి షేర్ చేసారో, అప్పుడు ఇంకా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఐతే ఇద్దరు చిన్నారులు పుట్టి అప్పుడే పది రోజులు దాటాయి కాబట్టి, నిన్న రాత్రి మెగా కొసలు ఉపాసన ఒక చిన్న వీడియో షేర్ చేసి, అందులో తాను హాస్పిటల్ కి ఎలా వెళ్లారో చూపించారు…ఆ అపూర్వ క్షణాలను మెగా కుటుంబానికే పరిమితం చేయకుండా, సోషల్ మీడియా లో షేర్ చేసి కోట్లాది మెగా అభిమానుల హృదయాలను ఆనందంతో నింపారు. అలాగే బిడ్డలు పుట్టిన వెంటనే కూడా సోషల్‌మీడియా మొత్తం శుభాకాంక్షల పోస్ట్స్ తో నిండిపోయింది. ఐతే నిన్న ఉపాసన షేర్ చేసిన వీడియో లో, తాను అనుభవించిన ఆ మధుర క్షణాలను అభిమానులతో పంచుకోవాలనే ఉద్దేశం తో పాటు, డాక్టర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని కొంతవరకు గోప్యంగా ఉంచుకుంటారు. కానీ ఉపాసన మాత్రం తన జీవితం, ఎమోషన్స్, తల్లిగా ప్రయాణాన్ని అభిమానులతో పంచుకున్నారు. అందుకే ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటారు. అందుకే ఈ స్పెషల్‌ వీడియో కూడా ఎంతో నిజాయితీతో, హృద్యంగా రూపొందించబడింది. డెలివరీకి ముందు జరిగిన ఆసుపత్రి ఏర్పాట్లు, వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల అండ, ప్రతి చిన్న విషయాన్ని ఈ వీడియోలో సున్నితంగా చూపించారు. సోషల్‌మీడియాలో ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెగా కుటుంబం విషయానికి వస్తే… ఈ కుటుంబంలో ప్రతి సంతోషం అభిమానులతో పంచుకునే సంప్రదాయం ఉంది. చిరంజీవి నుంచి మొదలుకుని ప్రతి తరం అదే అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు రామ్‌చరణ్‌ – ఉపాసనల ట్విన్స్‌ రాక కూడా ఆ ప్రేమ బంధాన్ని మరింత బలపరిచింది. చిన్నారుల పేర్లు ఎప్పుడు పెడతారు, వారి పేర్లు ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్సాహం అందరిలో ఉంది!