సమ్మర్ వచ్చిందంటే క్రికెట్ ప్రేమికులకు పండగే. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇక తాజాగా రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇది వరకు సీజన్ లో కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లడంతో తమ జట్టు కెప్టెన్ గా రియాన్ పరాగ్ ను ప్రకటించింది. గత సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు అతను కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతనిని కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నట్లు ఆ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రవీంద్ర జడేజా, యశస్వీ జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఆ జట్టులో ఉన్నారు.