ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటనకు విచ్చేసారు. ఆయనను ప్రధాని మోడీ స్వాగతించారు. డియర్ ఫ్రెండ్ కలుద్దాం అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భారతదేశానికి స్వాగతం! మీ పర్యటనను భారతదేశం సాదరంగా ఆహ్వానిస్తోంది. మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ పర్యటన కొత్త ఊపునిస్తుందని మేము భావిస్తున్నాము. మన చర్చలు వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని మరియు ప్రపంచ పురోగతికి దోహదపడతాయని నేను నమ్ముతున్నాను. నా ప్రియ మిత్రమా, త్వరలోనే ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీలో కలుద్దాం అంటూ ప్రధాని మోడీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ‘ఎక్స్’ లో భారతదేశానికి బయలుదేరాను! అంటూ పోస్ట్ పెట్టారు. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ముంబై నుండి న్యూఢిల్లీ వరకు మూడు రోజుల పర్యటన సాగనుంది.భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలకు వాస్తవ రూపం ఇచ్చే వ్యాపారవేత్తలు, ఆర్థిక, పారిశ్రామిక, సాంస్కృతిక మరియు డిజిటల్ రంగాల ప్రతినిధులు నాతో పాటు ఈ పర్యటనలో ఉన్నారు. మనమందరం కలిసి మన సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దాం. నా ప్రియ మిత్రమా, రేపు నిన్ను కలుస్తాను అంటూ ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. దానికి ప్రధాని పై విధంగా స్పందించారు.