జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఏపీవిద్యార్థులు సత్తా చాటడం గర్వకారణం:మంత్రి లోకేష్ 

Spread the love

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, అందులో మన రాష్ట్రానికి చెందిన నరేంద్ర బాబు గారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబరచడం అభినందనీయం. కఠోర శ్రమ, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

ఇక తాజాగా ఢిల్లీలోని ‘చార్లీ ఫాక్స్‌ట్రోట్ ఏవియేషన్ సర్వీసెస్’ (Charlie Foxtrot Aviation Services) ను మంత్రి లోకేష్ ప్రారంభించారు – నా అట్లాంటా పర్యటనలో పుట్టిన ఈ ఆలోచన, ఇప్పుడు సాకారమై విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది! భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగానికి ప్రపంచ స్థాయి ప్రతిభను అందించడంలో ఇది ఒక పెద్ద అడుగని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద  యువ పైలట్ క్యాడెట్‌లతో రాపిడ్-ఫైర్ Q&A సెషన్ లో మాట్లాడారు. ఇది భారతీయ విమానయాన రంగం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు అద్దం పడుతోందని పేర్కొన్నారు.