స్కూల్ విద్యార్థులతో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో అసెంబ్లీ కార్యకలాపాలు చూడటానికి వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు. అసెంబ్లీ చూడటం ఎలా ఉందని లోకేష్ అడగగా..అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా ఉందని, చాలా విషయాలు తెలిశాయని విద్యార్థులు ఆయనకు జవాబిచ్చారు. తాను విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తెలుగు మాట్లాడేందుకు పడిన ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోకూడదని.. ఇంగ్లీషు చదువుతూనే.. మాతృ భాష తెలుగును మర్చిపోవద్దని విద్యార్థులతో లోకేష్ చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం ఎలా వుందని విద్యార్థులను లోకేష్ ఆరా తీశారు. లోకేష్ తో మాట్లాడడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.