ఇప్పుడు హైదరాబాద్ లోనే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ

Spread the love

తెలుగు సినిమా సత్తా చాటుతోంది. గత పదేళ్లలో భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యుత్తమ చిత్రాలను తెరకెక్కిస్తూ తనదైన ముద్రను వేస్తూ ప్రపంచస్థాయికి చేరింది. ఇక్కడి దర్శకుల ప్రతిభ, నటీనటుల నటన, నిర్మాతల అభిరుచి మరింతగా తెలుగు సినిమాను వెలుగొందెలా చేస్తోంది.  ప్రపంచంలోని సాంకేతికత కూడా ఇప్పుడు తెలుగు సినిమాకు చేరువవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏ అండ్ ఎం మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ను దర్శకధీరుడు రాజమౌళి  ఆవిష్కరించారు. ‘బాహుబలి’, ‘ఈగ’ లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మన దగ్గర మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే బాగుండేదని అనుకునేవాడిని ఇప్పుడా టెక్నాలజీ అన్నపూర్ణ స్టూడియోలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ‘వారణాసి’ సినిమా కోసం అన్నపూర్ణలోని ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడి కీలక సన్నివేశాలు తీశామని అవి అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని  అన్నపూర్ణ సంస్థ, నిర్మాత  శోభు యార్లగడ్డ మిహిరా విజువల్ ల్యాబ్స్, హాలీవుడ్ కంపెనీ యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ మన పరిశ్రమలో ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు  ఉన్నారు. కానీ, ఆ అధునాతన సౌకర్యాలు ఇక్కడ లేవు. కానీ, ఇప్పుడా లోటు ఏ అండ్ ఎంతో తీరిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత, నటుడు నాగార్జున శోభు యార్లగడ్డ, బ్రెట్ ఇనెసన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *