‘పేట్రియాట్’.. అదరగొడుతున్న టాప్ స్టార్స్

Spread the love

మలయాళ దిగ్గజ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి కలసి నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా  ‘పేట్రియాట్’ మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరు అగ్రకథానాయకులు ఒకే సినిమాలో కనిపిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇద్దరి అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక  ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, నయనతార, కుంచకో బోబన్, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. అగ్ర హీరోలిద్దరూ గన్స్ పట్టుకుని మంచి యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టైటిల్ మరియు పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *