ప్రధాని నరేంద్రమోడీని ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మంథాన కలిశారు. హైదరాబాద్ లో జరగనున్న వీరి రిసెప్షన్ కు ప్రధానిని ఆహ్వానించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రిసెప్షన్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. హైదరాబాద్ లోని తాజ్ హోటల్ వేదికగా ఈ వేడుక జరగనుంది. ఇక రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ వేదికగా నిన్న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం ఘనంగా నిర్వహించారు. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే ఈ కొత్త జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ వారు పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.