టీ 20 వరల్డ్ కప్ లో సూపర్-8లో సౌతాఫ్రికాతో పరాజయం తరువాత తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వేపై గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకున్న భారత జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించారు. గెలుపు తప్పనిసరి అయిన మ్యాచ్ లే ఆటగాళ్లలోని అసలైన తెగువను బయటపెడతాయని 256 స్కోరు ఎన్నో విషయాలను స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ టీ20 వరల్డ్ కప్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే ఈమ్యాచ్ మొత్తంలో కనిపించిన ఆ గెలుపు కసి ప్రత్యేకంగా నిలిచిందన్నారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు ఇదే ఊపును తదుపరి మ్యాచ్ లోకి కూడా తీసుకెళ్లండని సచిన్ అభినందించారు. అలాగే, ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన జింబాబ్వేకు కూడా అభినందనలు! తెలిపారు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. భారత్ 256 పరుగులు చేయగా..జింబాబ్వే 184 పరుగులకే పరిమితమైంది. ఇక సూపర్-8లో మరో కీలక మ్యాచ్ ను భారత్ ఈ ఆదివారం వెస్టిండీస్ తో ఆడనుంది.