సూర్య-వెంకీ అట్లూరి సినిమా టైటిల్  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Spread the love

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘సూర్య 46’వ సినిమాగా రానుంది. ఈ మూవీకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సూర్య చిన్న బాబును ఎత్తుకొని పాల డబ్బాతో ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా  పూర్తిస్థాయి కుటుంబ చిత్రంగా ఇది రానున్నట్లు తెలుస్తోంది.  ఈ జులైలో దీన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.లక్కీ భాస్కర్’ వంటి హిట్ సినిమా తర్వాత వెంకీ దర్శకత్వంలో రానున్న సినిమా  కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. రవీనాటాండన్, రాధిక శరత్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  జీ.వీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *