యూఏఈ, ఇజ్రాయెల్ నేతలతో మాట్లాడిన భారత ప్రధాని మోడీ

Spread the love

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ యూఏఈ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని వేరు వేరు ‘ఎక్స్’ పోస్ట్ లలో ఈమేరకు తెలిపారు. యూఏఈ  అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడాను. యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ కష్టకాలంలో భారతదేశం యూఏఈకి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. 

యూఏఈలో నివసిస్తున్న భారతీయ సమాజం పట్ల తీసుకుంటున్న శ్రద్ధకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వానికి భారత్  మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని బెంజిమన్  నెతన్యాహుతో టెలిఫోన్ ద్వారా మాట్లాడాను. ఇటీవలి పరిణామాలపై భారతదేశ ఆందోళనలను తెలియజేయడంతో పాటు పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. శత్రుత్వాలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని భారతదేశం తరఫున పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *