ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఖమ్మంలో భూదాన్ కేటాయించిన దాదాపు 700 ఇళ్లను కూల్చివేసి, సుమారు 3,000 మందిని నిరాశ్రయులను చేయడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. ఈ ‘బుల్డోజర్ రాజ్’ పేదలపై ప్రభుత్వ అధికారాన్ని ప్రయోగించే బిజెపి నమూనాను తలపిస్తోందని విమర్శించారు. మేము ప్రజల పక్షాన ఉంటామని చెప్పుకునే కేరళలోని కాంగ్రెస్ నాయకత్వం, ఈ అవమానకరమైన చర్య నుండి తప్పుకోలేదన్నారు. అణగారిన వర్గాలపై తమ పార్టీ చేస్తున్న ఈ దాడికి వారు సమాధానం చెప్పాలని కేరళ సీఎం ప్రశ్నించారు.