దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో నేటి సెషన్ లో ట్రేడింగ్ ముగించాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడం, అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ బదులుగా మిస్సైల్ దాడులు చేయడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1,048 పాయింట్ల నష్టంతో 80,239 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ కూడా 312 పాయింట్లు నష్టపోయి 24,866 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.91.53గా కొనసాగుతోంది. రేపు (మార్చి 3) హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు పెరగడం కూడా దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరల పెరుగుదల వల్ల ఏవియేషన్, పెయింట్స్ మరియు ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీగా పడిపోయాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి.