భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయం సాధించాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ లో 23-21, 19-21, 21-17తో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన షి యుకిపై ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడారు. అయితే మెరుగైన ప్రదర్శనతో లక్ష్యసేన్ ఆకట్టుకున్నాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో మాళవిక బాన్సోద్ 11-21, 6-21తో చైనాకు చెందిన చెన్ యూఫీ చేతిలో పరాజయం చెందింది. మరోవైపు మహిళల డబుల్స్ తొలి రౌండ్ లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ 15-21, 21-15, 18-21తో జపాన్ కు చెందిన హిరోటా-సకురమోటో ద్వయం చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 21-17, 21-19తో మలేసియాకు చెందిన హూ పాంగ్-చెంగ్ సు యిన్ జోడీ చేతిలో ఓడింది.