ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్’ తో సంక్రాంతికి సందడి చేశారు. ఆయన అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో తన స్టామినా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ సినిమా ఇచ్చిన కిక్ మర్చిపోక ముందే, ఇప్పుడు ఆయన నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అదే భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర.
విశ్వంభర ఒక సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. మెగాస్టార్ ఇంత భారీ స్థాయిలో ఫాంటసీ జానర్లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. గతంలో కూడా ఆయన ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల్లో నటించి మంచి ఆదరణ పొందారు. అందుకే ఈ సినిమా కనీసం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత లేకపోవడం, అప్డేట్స్ ఆలస్యం కావడం వంటివి సినిమాపై ఉన్న హైప్‌ను కాస్త తగ్గించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. ముఖ్యంగా ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాతో కలిసి థియేటర్లలో ప్రదర్శించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అవుతున్న సందర్భంగా, అదే థియేటర్లలో విశ్వంభర ట్రైలర్ కూడా ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వనుందని సమాచారం. ఇది నిజమైతే మెగా అభిమానులకు డబుల్ బ్లాస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు రామ్ చరణ్ మాస్ ఎంటర్టైనర్, మరోవైపు చిరంజీవి భారీ ఫాంటసీ విజువల్స్ ఒకే రోజున థియేటర్లో ఈ అనుభూతి రావడం అంటే పండుగ వాతావరణమే. ఇక విశ్వంభర సినిమాకు గ్రాండ్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్ ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అందుకే విడుదల విషయంలో కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారట. మొత్తానికి, విశ్వంభర ట్రైలర్ పెద్దితో కలిసి విడుదల అవుతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ టాక్ మాత్రమే అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఫైనల్ క్లారిటీ రాగానే ఈ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.