యంగ్ టైగర్ పుట్టిన రోజు కానుకగా డ్రాగన్ ఫస్ట్ లుక్? – ఫాన్స్ కి పూనకాలే…

Spread the love

అగ్రనటుడు ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన రోజునుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా పై తారక్ అభిమానులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు కూడా ఈ కాంబినేషన్‌పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ పూర్తిగా స్లిమ్ లుక్‌లో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేపుతోంది. గతంలో మాస్, పవర్‌ఫుల్ పాత్రలతో ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా స్టైలిష్ ఇంకా ఫిట్ అవతారంలో దర్శనమివ్వబోతున్నారని సమాచారం. ఇటీవల షూటింగ్‌లకు వెళ్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో తారక్ ఫిట్‌నెస్, బాడీ లాంగ్వేజ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే సినిమా సెట్స్ నుంచి మాత్రం ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా మేకర్స్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే KGF ఇంకా Salaar చిత్రాలతో భారీ విజువల్ స్టాండర్డ్స్ సెట్ చేశారు. భారీ సెట్స్, డార్క్ టోన్, పవర్‌ఫుల్ హీరో ఎలివేషన్స్ ఇలా ఇవన్నీ ఆయన స్టైల్‌కు ప్రత్యేక గుర్తింపుగా మారాయి. ఇప్పుడు అదే మాస్ ఎనర్జీని తారక్‌తో మరింత ఎలివేట్ చేయబోతున్నారని టాక్. ముఖ్యంగా డ్రాగన్ ఫస్ట్ లుక్‌పై మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ అప్‌డేట్ ఒక్కటే సినిమా హైప్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని చెబుతున్నారు. తారక్ బర్త్‌డే అంటే సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్రాగన్ ఫస్ట్ లుక్ అదే రోజు విడుదలైతే, అది ఖచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఒక్క పోస్టర్‌తోనే భారీ ఇంపాక్ట్ ఇవ్వాలని మేకర్స్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఏమాత్రం తగ్గకుండా, ఒకేసారి భారీ బ్లాస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు అందరి చూపు మే 20పైనే ఉంది. ఆ రోజు విడుదలయ్యే ఫస్ట్ లుక్ నిజంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం మ్యాన్ ఆఫ్ మాసెస్ మరోసారి బాక్సాఫీస్‌ను దద్దరిల్లించేందుకు రెడీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *