దేశంలోనే ప్రముఖ వైద్య మరియు పరిశోధనా కేంద్రంగా మంగళగిరి ఎయిమ్స్ ను తీర్చిదిద్దడమే టార్గెట్ 

Spread the love

AIIMS మంగళగిరిని దేశంలోనే ప్రముఖ వైద్య మరియు పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. AIIMS మంగళగిరిలో జరిగిన సమీక్షలో పలు కీలక అంశాలను పరిశీలించారు. ప్రస్తుతం 2200 పోస్టుల్లో 1660కు పైగా భర్తీ అయ్యాయని తెలిపారు. గత ఏడాది మేము నిర్వహించిన సమావేశంలో ఇక్కడి పరిస్థితిని పరిశీలించిన క్రమంలో ఇవిగాక 534కి పైగా కొత్త పోస్టులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాశీతారామన్ గారి ద్వారా మంజూరు చేయించాము. అవి కూడా త్వరలో భర్తీ అవుతాయని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రోజుకు 3,500కి పైగా రోగులకు సేవలు అందిస్తున్న AIIMS లో బెడ్ సామర్థ్యం, ఐసీయూ సదుపాయాలు, స్కానింగ్ మరియు ల్యాబ్ సేవలు గణనీయంగా పెరిగాయని వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *