సంవత్సర కాలంలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యాన్ని పూర్తిచేసుకున్న శుభ సందర్భంలో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వారితో సమావేశమై వారి విజయగాథలు ఏపీ సీఎం చంద్రబాబు విన్నారు. మహిళల కష్టానికి, సంకల్పానికి… ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఈ విజయం సాధ్యమైందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన శిక్షణ, మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించే దిశగా వివిధ సంస్థలతో సెర్ప్, మెప్మా 36 ఒప్పందాలు చేసుకున్నాయని వివరించారు. వీటి ద్వారా రానున్న రోజుల్లో లక్షల మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.