ఈ ట్రోఫీ ద్రావిడ్, లక్ష్మణ్ లకు అంకితం 

Spread the love

టీ 20 వరల్డ్ కప్ ను గెలుచుకుని భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ గెలుపు అనంతరం గౌతమ్ గంభీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఈ ట్రోఫీని రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ కు అంకితమిస్తున్నా. టీమ్ ఇండియాను గాడిలో పెట్టినందుకు రాహుల్, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో  సేవలందిస్తున్నందుకు లక్ష్మణ్ దీనికి అర్హులని అతడు పేర్కొన్నాడు. ఇక భారత్ తాజాగా జరిగిన ఫైనల్ లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో ఓడించి మూడో సారి ఈ టోర్నీని కైవసం చేసుకుంది. ఇది వరకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2007లో మొదటి సారే గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించగా..గత టీ 20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మ నేతృత్వంలో రెండో సారి అలాగే ఈ వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి మూడో సారి గెలిచి చరిత్ర తిరగరాసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *