టెక్నాలజీ రోజు రోజుకు సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రతీదీ టెక్నాలజీ చేరువ చేస్తోంది. గతంలో ఉహలకే పరిమితమైన కొన్ని పనులు నేడు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. దాదాపు గత దశాబ్దం వరకు అందుబాటులో లేని సరికొత్త టెక్నాలజీలు నేడు సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చేశాయి. టెక్నాలజీ సెక్యూరిటీకి కూడా కీలకంగా మారిన ఈ తరుణంలో సీసీ కెమెరాల వినియోగం కూడా బాగా పెరిగింది. అంతకు ముందు వరకు గవర్నమెంటు కార్యాలయాలకు, కొన్ని వ్యాపార సముదాయాలకు మాత్రమే వీటిని విరివిగా వినియోగించే వారు అయితే ఇప్పుడు ఇళ్లలో కూడా చాలామంది సీసీ కెమెరాలను పెట్టించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇంట్లో వంటమనిషి లేదా పిల్లలను చూసుకునే కేర్ టేకర్ ఉన్నప్పుడు. అలా సీసీ కెమెరా పెట్టిన కూడా రోజుల మొత్తం ఏం జరిగిందో చూడాలంటే.. గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కాస్త విసుగుతో కూడుకున్న పని. కానీ బెంటళూరుకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ మాత్రం ఈ శ్రమ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన వంట మనిషి చేస్తున్న తప్పులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
సదరు టెక్కీ తన కిచెన్ లోని క్లాక్ ఐక్యూ 4.5 అనే ఏఐ టూల్ కు అటాచ్ చేశాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ ఏఐ కెమెరా వీడియో రికార్డ్ చేయడమే కాకుండా.. ఆమె ప్రతి కదలికను విశ్లేషించి యజమానికి రాతపూర్వక నివేదికలను పంపించింది. ఆ రిపోర్ట్ లో ఏం తేలిదంటే.. రోజు సాయంత్రం 7 గంటలకు 12 నిమిషాలకు రాగానే ఫ్రిడ్జ్ తెరిచి.. రెండు యాపిల్స్ తన బ్యాగులో వేసుకున్నట్లు ఏఐ సమయంతో సహ లెక్కకట్టింది. అలాగే డస్ట్ బిన్ మూత తాకి, ముక్కు రుద్దుకున్న చేతులతో చపాతీలు చేయ్యడం వంటి.. ఆనారోగ్యకరమైన పనులను క్లియర్ గా చూపించింది. స్టవ్ వెనుక భాగాన్ని వారం రోజులుగా శుభ్రం చేయడంలేదని చెప్పింది. వారానికి ఒకసారి ఏఐ పంపే రిపోర్ట్ లో ఎన్ని యాపిల్స్, బ్లూబెర్రీలు మాయం అయ్యాయో లెక్కలతోసహ చూపించడమే కాకుండా ఈ పండ్లకు అయ్యే ఆమె నెలకు 4వేల 800 బిల్లు వేస్తుందని.. యజమానికి గుర్తు చేయ్యడం విశేషం. ఈ నివేదికల ఆధారంగా ఆ టెక్కీ ఆమెను పనిలో నుంచి తొలిగించాడు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో.. భవిషత్తుల్లో టెక్నాలజీ మనల్ని ఎంత నిశితంగా గమనించబోతుందో అర్ధమవుతోంది. దొంగతనం చేస్తే.. దేవుడు చూస్తాడో లేదో తెలియదు కానీ.. ఏఐ మాత్రం ఖచ్చితంగా చూస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదు. ఇక్కడ మరో అంశం ఏంటంటే.. గంటలత తరబడి సీసీ కెమెరాలు చూసే ఓపికలేని యజమానులకు.. ఏఐ స్మార్ట్ ఓ వరమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ స్థాయిలో నిఘా పెట్టడం వల్ల పని మనుషుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందనే చర్చ కూడా నెట్టంట మొదలైంది. అందుకే ఏఐని జాగ్రత్తగా మరియు బాధ్యతతో ఉపయోగించాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు.