సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత హైప్ ఉన్న సినిమా గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అదే కాంబినేషన్ మళ్లీ కలవడంతో ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ పొందింది. ఇక విడుదలకు ఇంకా కొద్ది రోజులే ఉన్నా, ఇప్పటికే సినిమా చుట్టూ మంచి హైప్ కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఉత్సాహం కనిపిస్తోంది. టీజర్‌లో పవన్ కళ్యాణ్ చూపించిన మాస్ యాటిట్యూడ్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. టీజర్ లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని చూపించాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా మంచి రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే ఈ హీరోయిన్స్ కేవలం గ్లామర్ కోసం కాకుండా వీరి పాత్రలు కూడా సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతున్నాయి. ముఖ్యంగా మాస్ బీట్‌తో వచ్చిన పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ త్వరలోనే ఒక పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *