టీ20 వరల్డ్ కప్ విజేతగా మూడో సారి నిలిచి చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ టీమ్ కు బీసీసీఐ రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 15 మంది ప్లేయర్స్ తో పాటు టీమ్ స్టాఫ్ మొత్తానికి ఈ నగదు ఇవ్వనున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం ప్లేయర్స్ కు దక్కుతుంది. స్థాయిని బట్టి సహాయ సిబ్బందికి ఇచ్చే మొత్తాన్ని నిర్ణయిస్తారు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టుకు రూ.125 కోట్లు ఇవ్వగా.. ఇప్పుడు మరో రూ.6 కోట్లు పెంచి అందించనున్నారు. ఒక్కో ఆటగాడికి రూ.6 కోట్లు ఇచ్చి.. మిగతా రూ.41 కో సహాయ సిబ్బందికి పంచనున్నట్లు సమాచారం. చరిత్రాత్మక విజయం సాధించినందుకు ప్లేయర్స్ మరియు టీమ్ స్టాఫ్ కు బీసీసీఐ మరోసారి అభినందనలు తెలుపుతోంది. భవిష్యత్తులోనూ ఈ గెలుపుల హవా కొనసాగాలని ఆకాంక్షిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఈనెల 8న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై భారీ విక్టరీతో సత్తా చాటిన విషయం విదితమే. ఈ ఫార్మాట్ లో భారత్ 2007, 2024, 2026లలో విశ్వ విజేతగా నిలిచింది.