ఇదే మన  దౌత్యం..హార్ముజ్ నుంచి కదిలిన భారత్ నౌకలు..తీరనున్న చమురు కష్టాలు

Spread the love

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పర్షియన్ గల్ఫ్ ఇంధన మంటలతో భగభగలాడుతోంది. యుద్ధ పరిస్థితులతో అట్టడుకుతున్న వేళ, ప్రపంచమంతా చమురు కోసం అర్రులుచాస్తుంటే .. మన భారత్ మాత్రం తన దౌత్య చతురతతో గమ్యాన్ని చేరుకుంటోంది. ‘హార్ముజ్ జలసంధి’లో చిక్కుకున్న మన నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేలా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నడిపిన వ్యూహం ఫలించింది. ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో భారత నౌకలు కదిలాయి. 

హార్ముజ్ జలసంధి – ఇది ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైనది. ఇక్కడ చిన్న అలజడి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తాయి. అలాంటి కీలకమైన ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో భారతీయ నౌకల రాకపోకలపై సందిగ్దత నీలకాండ్. అయితే ఇరాన్ ప్రభుత్వం భారతదేశానికి తన సపోర్ట్ అందించింది. భారత నౌకలు సాఫీగా వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తూ పచ్చజెండా ఊపింది. ఈ విజయం వెనుక ఉన్న అసలైన సూత్రధారి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. ప్రపంచ దేశాల అగ్రనేతలతో ఆయన జరిపిన చర్చలు ఇప్పుడు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి.  ఒకవైపు ఇరాన్ పాలకులతో, మరోవైపు ప్రపంచ శక్తులతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అదే సమయంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. జైశంకర్ చూపిన దౌత్యనీతి తో హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇరాన్ రక్షణ కల్పించడం విశేషం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మొత్తం 28 భారతీయ చమురు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటుకుని భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇది దేశ ఇంధన భద్రతకు ఎంతో కీలకం.

ఈ నౌకల్లో సుమారు 778 మంది భారతీయ నావికులు ఉన్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది.ఇప్పటికే రెండు భారీ నౌకలు ముంబై తీరానికి చేరుకున్నాయి. మిగిలిన నౌకలు కూడా అతి త్వరలోనే భారత తీరానికి చేరుకోనున్నాయి. సంక్షోభ సమయంలో మన నావికులు చూపిన ధైర్యం, ఓర్పు అమోఘం. అటు ఇరాన్ సహకారం, ఇటు భారత ప్రభుత్వ గట్టి ప్రయత్నాలు వెరసి ఈ ఆపరేషన్ విజయవంతమైంది. భారతదేశానికి అవసరమైన చమురులో అత్యధిక భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ జలసంధిలో భారత్ తన పట్టును నిరూపించుకుంది. అగ్రరాజ్యాలు కూడా ఇక్కడ నౌకలను పంపేందుకు వెనక్కు తగ్గుతున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య బలంతో మార్గాన్ని సుగమం చేసుకుంది. భారత్ ఇప్పుడు ప్రపంచ వేదికపై కేవలం ఒక దేశంగా మాత్రమే కాదు, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోంది.

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ 28 నౌకల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది..హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో 24 నౌకలు ఉన్నాయి.జలసంధికి తూర్పు వైపున 4 నౌకలు నిలిచిపోయాయి. ఈ అన్ని నౌకల్లో కలిపి మొత్తం 778 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అనుమతులు లభించడంతో, పశ్చిమ మరియు తూర్పు భాగాల్లో నిలిచిపోయిన నౌకలు ఇక తమ గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. అంతర్జాతీయ జలాల్లో తలెత్తిన ఈ  పరిస్థితిని చక్కదిద్దడంలో  భారత ప్రభుత్వ చొరవ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ రగులుతోంది. ఇజ్రాయెల్ – హమాస్, హిజ్బుల్లా ఘర్షణలు కాస్తా ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావం నేరుగా వరల్డ్ ఫ్యూయల్  మార్కెట్‌పై పడింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి  కేంద్రంగా ఇప్పుడు హైడ్రామా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% ఈ మార్గంనుండే  వెళ్లాలి. ఇరాన్ ఇప్పుడు ఈ మార్గంపై తన పట్టును బిగించింది. అమెరికా, యూరప్ దేశాలు, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే దేశాల ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తూ ఇరాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రంగంలోకి దిగారు. కేవలం ఒక్క దేశంతోనే కాదు, ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న లేదా ప్రభావితం చేయగల ముగ్గురు కీలక నేతలతో ఆయన సంభాషించారు. అబ్బాస్ అరఘ్చి ఇరాన్ విదేశాంగ మంత్రి  భారత్‌కు చమురు భద్రత ఎంత ముఖ్యమో వివరిస్తూనే, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్  ఇరాన్‌కు సన్నిహిత మిత్రుడైన రష్యాతో చర్చించి, ప్రాంతీయ స్థిరత్వంపై దృష్టి సారించారు. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారో  పాశ్చాత్య దేశాల వైఖరిని, శాంతి చర్చల ఆవశ్యకతను పంచుకున్నారు. జైశంకర్ ఇతర దేశాల ఒత్తిళ్లకు లొంగకుండా, భారత ప్రయోజనాలే ప్రాతిపదికగా జరిపిన చర్చలు ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయి. 

ప్రపంచ దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్, భారత్ విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిలో భారత ఆయిల్ ట్యాంకర్లకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేయడమే కాకుండా, ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించింది. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారత్‌ కు వచ్చే చమురు గ్యాస్ నౌకలకు ‘గ్రీన్ ఛానల్’ సౌకర్యం.అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, భారత్‌కు తక్కువ ధరకే ఇంధనం అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. చౌబహార్ పోర్ట్ వంటి ప్రాజెక్టుల నేపథ్యంలో భారత్‌ ను ఇరాన్ ఒక నమ్మకమైన మిత్రుడిగా గుర్తించింది.  అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలపై ఇరాన్ కఠిన ఆంక్షలు విధిస్తున్న తరుణంలో, భారత్ మాత్రం వారితోనూ, ఇటు ఇరాన్‌తోనూ సమతుల్యతను పాటిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ ఇలాగే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే పునరావృతమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *