ఆదాయార్జన శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వస్తుందని ప్రతీ రంగంలోనూ వృద్ధి సాధించటం ద్వారా జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. కొందరు కాంట్రాక్టర్లు తమ ఆఫీసులు వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నారని పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారన్నారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లలోని కాంట్రాక్టర్ల నుంచి ఆదాయం రావటం లేదని పేర్కొన్నారు. నేషనల్ హైవేలు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు చెల్లించే ట్యాక్స్ లు మన రాష్ట్రంలో చెల్లించేలా చూడాలన్నారు. ట్యాక్స్ ల వసూళ్ల విషయంలో అనవసరపు వేధింపులు వద్దని సూచించారు. ట్యాక్స్ ఎగవేతలు లేకుండా ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదని ట్యాక్స్ లు చెల్లించేలా చూడాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి ట్యాక్స్ ఎగవేతకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.