‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్ ను చంద్రబాబు సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ను పరిశీలించి రుచి చూశారు. గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఫుడ్ ను మరింత ప్రోత్సహించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. టూరిజం, ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ కలిసి రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య సంస్థలకు స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నాయని సీఎంకు అధికారులు వివరించారు.