APGENCO రికార్డు..సీఎం చంద్రబాబు అభినందనలు

Spread the love

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని పేర్కొన్నారు.  GENCOప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6610 మెగావాట్లు కాగా….ఈ నెల 11వ తేదీన 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.  విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో సాధించే అద్భుత విజయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *