ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని పేర్కొన్నారు. GENCOప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6610 మెగావాట్లు కాగా….ఈ నెల 11వ తేదీన 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో సాధించే అద్భుత విజయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.