అల్లు సినిమాస్ ప్రారంభం

Spread the love

హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో నిర్మించిన  “అల్లు సినిమాస్” ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒకే రోజు సినిమా, వినోద రంగాలకు సంబంధించిన నెట్ ఫ్లిక్స్, అల్లు  సినిమాస్ లాంటి రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ప్రారంభించడం హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా శర వేగంగా దూసుకుపోతుందనడానికి సంకేతమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ  ప్రభుత్వంలో ఫార్మా, ఐటీ, నిర్మాణ రంగాలతో సమానంగా సినీ పరిశ్రమకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.  ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిర్మించిన అల్లు కుటుంబాన్ని సీఎం రేవంత్ అభినందించారు. హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్, గ్లోబల్ డెస్టినేషన్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ‘Telangana Rising 2047’ విజన్‌లో భాగంగా వినోద రంగాన్ని ఒక బలమైన పరిశ్రమగా తీర్చిదిద్దుతూ, అంతర్జాతీయ పెట్టుబడులకు మరియు అత్యాధునిక మౌలిక సదుపాయాలకు తెలంగాణ  రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని పేర్కొంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *